‘కబ్జ’ కబురు

ఉపేంద్ర కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జ’. ఆర్‌.చంద్రు దర్శకనిర్మాత. మార్చి 17న తెలుగు, కన్నడతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 02 Feb 2023 01:29 IST

పేంద్ర కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కబ్జ’. ఆర్‌.చంద్రు దర్శకనిర్మాత. మార్చి 17న తెలుగు, కన్నడతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్‌.సుధాకర్‌రెడ్డి సమర్పణలో కథానాయకుడు నితిన్‌ సొంత నిర్మాణ సంస్థలైన రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎన్‌.సినిమాస్‌ పతాకాలపై తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఎన్‌.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే కథానాయకుడు ఉపేంద్ర. ఆయన నటించిన ‘కబ్జ’పై గొప్ప అంచనాలున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన కన్నడ చిత్రాలకి దీటుగా దీన్ని రూపొందించారు ఆర్‌.చంద్రు. 1947 నుంచి 84 కాలంలో నడిచే కథతో, మాఫియా ప్రపంచం చుట్టూ సాగుతుంద’’న్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని