చిరు ఉదారత

కథానాయకుడు చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్‌ ఛాయాగ్రాహకుడు దేవరాజ్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.

Updated : 03 Feb 2023 03:18 IST

థానాయకుడు చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్‌ ఛాయాగ్రాహకుడు దేవరాజ్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆయన్ని తన నివాసానికి ఆహ్వానించి ఆతిథ్యం అందించడంతో పాటు రూ.5లక్షలు ఆర్థిక సాయమందించి అండగా నిలిచారు. 1980-90ల మధ్య కాలంలో దేవరాజ్‌ స్టార్‌ ఛాయాగ్రాహకుడిగా ఓ వెలుగు వెలిగారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, ఎంజీఆర్‌, రాజ్‌కుమార్‌, రజనీకాంత్‌.. ఇలా ఎందరో ప్రముఖ హీరోల చిత్రాలకు పని చేశారు. చిరంజీవి నటించిన ‘నాగు’, ‘పులిబెబ్బులి’, ‘రాణి కాసుల రంగమ్మ’ లాంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని