ఆరంభానికి సన్నద్ధం

ఎన్టీఆర్‌ 30వ సినిమా ఆరంభానికి రంగం సిద్ధమవుతోంది.  పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Published : 03 Feb 2023 03:11 IST

న్టీఆర్‌ 30వ సినిమా ఆరంభానికి రంగం సిద్ధమవుతోంది.  పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిత్రీకరణ కోసం ఒక పక్క సెట్స్‌ పనులు జరుగుతుంటే... మరోపక్క దర్శకత్వ బృందం గోవాలో తుదిదశ కథా చర్చల్ని పూర్తి చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు సంగీత దర్శకుడు అనిరుధ్‌ బాణీల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలోనే చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. రెగ్యులర్‌ చిత్రీకరణ వచ్చే నెల ఆరంభం నుంచి షురూ కానుంది. యువ సుధ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించనున్నారు.ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ సంస్థ సమర్పిస్తోంది. రత్నవేలు కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని