కొత్త చిత్రానికి శ్రీకారం

‘హీరో’తో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు అశోక్‌ గల్లా. ఇప్పుడాయన హీరోగా రెండో చిత్రం ఖరారైంది.

Published : 06 Feb 2023 01:26 IST

‘హీరో’తో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు అశోక్‌ గల్లా. ఇప్పుడాయన హీరోగా రెండో చిత్రం ఖరారైంది. దీనికి ‘గుణ 369’ ఫేమ్‌ అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించనున్నారు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్‌ క్లాప్‌ కొట్టగా.. నమ్రత శిరోద్కర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి, సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా స్క్రిప్ట్‌ను ప్రశాంత్‌వర్మకు అందించారు. అనంతరం అశోక్‌ గల్లా మాట్లాడుతూ.. ‘‘నేను సాఫ్ట్‌గా ఉంటానని అంటారు. ఈ చిత్రంతో నన్ను అందరూ రఫ్‌ లుక్‌లో అంగీకరిస్తారని నమ్ముతున్నా. మీ అందరి కోసం ఓ మంచి సినిమా తెచ్చాం. దీనికి ప్రశాంత్‌వర్మ కథ అందించడం మాకెంతో నమ్మకాన్నిస్తోంది’’ అన్నారు. ‘‘కొత్త కథ ఇది. ప్రశాంత్‌వర్మ ఎంటర్‌టైనింగ్‌ స్క్రిప్ట్‌ అందించారు. దీనికి సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు అర్జున్‌. ‘‘నేనెంతో ఇష్టపడి రాసుకున్న కథ ఇది. అందరికీ గుర్తుండిపోయే చిత్రమవుతుంది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు ప్రశాంత్‌వర్మ. కార్యక్రమంలో ఆది శేషగిరిరావు, బీవీఎస్‌ రవి, గల్లా జయదేవ్‌, సాయిమాధవ్‌ బుర్రా తదితరులు పాల్గొన్నారు. సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని