స్టార్‌ కపుల్‌పై కంగనా ఆరోపణలు..

తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసే కంగన మరోసారి ఓ స్టార్‌ జంటను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్‌లో కాసనోవాగా పిలుచుకొనే వ్యక్తి, అతని భార్య కలిసి తనపై నిఘా పెట్టారని ఆరోపించింది.

Published : 07 Feb 2023 01:23 IST

నదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసే కంగన మరోసారి ఓ స్టార్‌ జంటను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. బాలీవుడ్‌లో కాసనోవాగా పిలుచుకొనే వ్యక్తి, అతని భార్య కలిసి తనపై నిఘా పెట్టారని ఆరోపించింది. వారిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరినీ పోస్ట్‌ చేసింది. ‘‘నా వాట్సాప్‌ డేటా, వృత్తిపరమైన, వ్యక్తిగత జీవిత విషయాలు లీక్‌ చేస్తున్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ఆ హీరో తన భార్యను నాలా నిర్మాతగా మారాలని, నాలా లేడి ఓరియేంటెడ్‌ సినిమాలు చేయాలని, దుస్తులు వేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. నా దగ్గర పని చేసినా సిబ్బందిని మొత్తం వాళ్లు నియమించుకున్నారు. నా సోదరుడి రిసెప్షన్‌కి ధరించిన చీరనే ఆమె తన పెళ్లికి వేసుకుంది’ ఇది గగ్గుర్పాటు కలిగించే విషయం. ఈ డేటా మొత్తం అతనికి ఎలా తెలుస్తుంది. అతనితో పాటు అతని భార్య, పాప కూడా ఇబ్బందుల్లో పడతార’’ ఒక పోస్ట్‌ని పెట్టింది కంగన. ఆమె ప్రస్తుతం ‘చంద్రముఖి 2’తో పాటు ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని