హృదయాల్ని హత్తుకునే రైటర్‌ పద్మభూషణ్‌

‘‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’’ అని ప్రశంసించారు హీరో మహేష్‌బాబు. సుహాస్‌ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రమిది.

Published : 07 Feb 2023 01:25 IST

‘‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్’’ అని ప్రశంసించారు హీరో మహేష్‌బాబు. సుహాస్‌ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కించిన చిత్రమిది. శరత్‌ చంద్ర, అనురాగ్‌, చండ్రు మనోహరన్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్‌ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమాని ఆద్యంతం చాలా ఎంజాయ్‌ చేశా. హృదయాల్ని హత్తుకునే చిత్రమిది. ముఖ్యంగా క్లైమాక్స్‌. సుహాస్‌ నటన చాలా నచ్చింది. ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాతలకు, చిత్ర బృందానికి అభినందనలు’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని