మిస్టరీ థ్రిల్లర్‌.. ‘వసంత కోకిల’

బాబీ సింహా హీరోగా రమణన్‌ పురుషోత్తమ తెరకెక్కించిన చిత్రం ‘వసంత కోకిల’. రజనీ తాళ్లూరి, రేష్మి సంయుక్తంగా నిర్మించారు. కశ్మీర పరదేశి కథానాయిక. ఆర్య కీలక పాత్ర పోషించారు.

Updated : 07 Feb 2023 14:05 IST

బాబీ సింహా హీరోగా రమణన్‌ పురుషోత్తమ తెరకెక్కించిన చిత్రం ‘వసంత కోకిల’. రజనీ తాళ్లూరి, రేష్మి సంయుక్తంగా నిర్మించారు. కశ్మీర పరదేశి కథానాయిక. ఆర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో చిరంజీవి ఇటీవల విడుదల చేశారు. ఈ చిత్రంలో బాబీ సింహా.. రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బట్టి.. మిస్టరీ థ్రిల్లర్‌ కథతో సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇందులో ప్రేమకథతో పాటు చక్కటి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ను మిళితం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీతం: రాజేష్‌ మురుగేశన్‌, కూర్పు: వివేక్‌ హర్షన్‌, ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్‌.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని