Tiger Nageswarao: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జోరు

రవితేజ (Raviteja) కథానాయకుడిగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswarao). అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

Updated : 08 Feb 2023 07:22 IST

రవితేజ (Raviteja) కథానాయకుడిగా వంశీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswarao). అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణూ దేశాయ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం ఓ భారీ నైట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. త్వరలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నట్లు చెప్పారు. 1970 కాలం నాటి స్టువర్టుపురంలో నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ కాలంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు జీవితకథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని