Sridevi: చైనాలో శ్రీదేవి ఇంగ్లిష్‌ వింగ్లిష్‌ విడుదల

భారతీయ చిత్రసీమను ఏలిన అగ్రకథానాయిక దివంగత శ్రీదేవి (Sridevi) నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ (English Vinglish) సినిమా చైనా ప్రేక్షకులను అలరించనుంది.

Updated : 08 Feb 2023 07:17 IST

భారతీయ చిత్రసీమను ఏలిన అగ్రకథానాయిక దివంగత శ్రీదేవి (Sridevi) నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ (English Vinglish) సినిమా చైనా ప్రేక్షకులను అలరించనుంది. ఆమె ఐదవ వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 24న చైనాలో ఆరువేల థియేటర్లలో విడుదల కానుంది. గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇక్కడ మంచి ఆదరణ దక్కించుకుంది. ఒక గృహిణికి(శశి) సంబంధించిన కథ ఇది. ఆమెకి సరిగ్గా ఇంగ్లీష్‌ రాదని తన భర్త, పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆమె భాష నేర్చుకునే క్రమంలో తన గురించి మరింతగా తెలుసుకొని భార్యగా, తల్లిగా తన జీవితాన్ని విలువైనదిగా భావిస్తుంది. ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోన్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సీఓఓ కుమార్‌ అహుజా మాట్లాడుతూ..‘‘శ్రీదేవి కెరీర్‌లో మరపురాని సినిమాలలో ఒకటైన ఈ చిత్రాన్ని  చైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాము’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని