Shaakuntalam: శాకుంతలం మళ్లీ వాయిదా

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) మరోమారు వాయిదా పడింది.

Updated : 08 Feb 2023 06:59 IST

సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) మరోమారు వాయిదా పడింది. గతేడాది నవంబరులోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. గ్రాఫిక్స్‌ పనులు ఆలస్యమవడం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పనులన్నీ కొలిక్కి రావడంతో ఈ నెల 17న విడుదల చేయాలని భావించారు. కానీ, ఇప్పుడీ సినిమాని మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘‘ప్రియమైన ప్రేక్షకులకు ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాం. ఈ నెల 17న ‘శాకుంతలం’ను విడుదల చేయలేకపోతున్నాం. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల - దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్‌ తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్‌ పాత్రను సమంత పోషించగా.. దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని