Keeravani: ఆస్కార్‌ వేదికపై కీరవాణి ప్రదర్శన?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)లోని ‘‘నాటు నాటు’’ (Naatu Naatu) పాటతో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani).. ఇప్పుడు ఆస్కార్‌ను అందుకునేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారు.

Updated : 08 Feb 2023 07:04 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోని ‘‘నాటు నాటు’’ (Naatu Naatu) పాటతో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani).. ఇప్పుడు ఆస్కార్‌(Oscars)ను అందుకునేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారు. ఈ గీతం ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఈ పాటను ప్రత్యక్షంగా ప్రదర్శించమని కీరవాణితో పాటు గీత రచయిత చంద్రబోస్‌కు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపిందని సమాచారం. ఇలా ఓ భారతీయ సంగీత దర్శకుడు ఆస్కార్‌ వేదికపై ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏఆర్‌.రెహమాన్‌ ‘స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌’లోని ‘‘జయహో’’ గీతాన్ని లైవ్‌లో ప్రదర్శించారు. ఆ పాటతోనే ఆయన ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని