సంక్షిప్త వార్తలు(4)

బాలీవుడ్‌ నటి నుష్రత్‌ ‘ఛోరి-2’తో సాక్షిగా మళ్లీ రాబోతుంది. విశాల్‌ ఫ్యూరియా తెరకెక్కించిన ‘ఛోరి’ చిత్రం 2021 నవంబరులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Published : 09 Feb 2023 01:57 IST

రెండో ‘ఛోరీ’ పూర్తి

బాలీవుడ్‌ నటి నుష్రత్‌ ‘ఛోరి-2’తో సాక్షిగా మళ్లీ రాబోతుంది. విశాల్‌ ఫ్యూరియా తెరకెక్కించిన ‘ఛోరి’ చిత్రం 2021 నవంబరులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ‘ఛోరి-2’ రాబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తియ్యింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌ చిత్రంలో సాక్షి కథ మొదటి భాగంలో ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి మళ్లీ మొదలవుతుంది.


పందిరి మంచం కథతో..

వీ గణేష్‌బాబు హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కట్టిల్‌’. సృష్టి డాంగే, కన్నిక కథానాయికలు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి, అనేక అవార్డులు అందుకున్న ఈ సినిమా ‘పందిరి మంచం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ‘‘కోవెలలో..’’ గీతాన్ని దర్శకుడు మోహన్‌రాజా విడుదల చేశారు.


యుముడికి సోదరుడు

జై రమేష్‌, శ్రీదేవి, రుక్మిణి, భానుచందర్‌ ప్రధాన పాత్రల్లో ప్రదీప్‌ రాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్‌ ధర్మ’. బ్రదర్‌ ఆఫ్‌ యమ.. అన్నది ఉపశీర్షిక. రమేష్‌ ఆర్‌.కె నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో బుధవారం విడుదల చేశారు. అనంతరం నిర్మాత రమేష్‌ మాట్లాడుతూ.. ‘‘పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కథ చెప్పమని దర్శకుడ్ని అడిగాను. నా భావాలకు అనుగుణంగా మంచి సన్నివేశాలు, పాటలు, ఫైట్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశారు. ఇందులో వినోదానికి, రొమాన్స్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, బాబ్జీ, కోట శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


మదిని హత్తుకునే ‘అల్లంత దూరాన’

విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వల తెరకెక్కించారు. ఎన్‌.చంద్రమోహనరెడ్డి నిర్మాత. ఈ సినిమా ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నటుడు అలీ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం నిర్మాత చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఓ మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించాలన్న తపనతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. ‘‘కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడూ మెచ్చేలా ఉంటుందీ చిత్రం. ఇందులో మంచి సీనియర్‌ ఆరిస్టులున్నారు’’ అన్నారు దర్శకుడు చలపతి. ఈ చిత్ర నాయకానాయికలు మాట్లాడుతూ.. ‘‘మనసుల్ని హత్తుకునే సినిమా ఇది. రధన్‌ సంగీతం, కల్యాణ్‌ ఛాయాగ్రహణం అలరిస్తాయ’’న్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ రావు, రాంబాబు, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు