Kriti Sanon: ఆ విషయంలో అభద్రతాభావం లేదు

అందంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది కథానాయిక కృతిసనన్‌ (Kriti Sanon).

Updated : 09 Feb 2023 07:05 IST

అందంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది కథానాయిక కృతిసనన్‌ (Kriti Sanon). ఇటీవల ఆమె నటించిన ‘మిమీ’(Mimi)లోని పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇందులో సరోగేటెడ్‌ తల్లిగా నటించి మెప్పించింది కృతి. తెరపై భిన్నమైన గెటప్పుల్లో కనిపించడమే తనకు ఇష్టమని చెబుతోందామె. ‘‘నా గత చిత్రం భేడియాలో డా.అనిక పాత్రలో ప్రేక్షకులకు నచ్చేలా కనిపించాను. అయితే, అయ్యో నువ్వు నటివి, ఎందుకు అందంగా కనిపించవని, మరికొందరు మీరు చూడటానికి చాలా అందంగా కనిపిస్తారు, మిమ్మల్ని మీరు ఎందుకలా తక్కువ చేసుకుంటారు, తెరపైకి ఎందుకలా పొట్టి జుట్టుతో వెళ్తారని ఇలా అనేవాళ్లు చాలా మంది ఉంటారు. నటీనటులు భిన్నంగా కనిపించడం ముఖ్యమని నేను భావిస్తున్నాను’ అని చెప్పింది. తెరపై ఎలా కనిపించినా నాకు సమస్య లేదు... భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా సిద్ధమే అని చెప్పింది. ‘నేను తెరపై కనిపించే విధానం గురించి నాకు ఎలాంటి అభద్రతభావం లేదు. రాబోయే చిత్రంలో నేను ఇంకా ప్రత్యేకంగా కనిపించబోతున్నాను’ అని చెప్పింది కృతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని