Taraka Ratna: ఒకటో నెంబర్ తారక
ఎన్టీఆర్ మనవడిగా ఆయన నట వారసత్వం పుణికి పుచ్చుకుని చిత్రసీమలో అడుగులేసిన మరో నందమూరి హీరో... తారకరత్న.అప్పట్లో ఆయన పరిచయమే ఓ సంచలనం.
ఎన్టీఆర్ మనవడిగా ఆయన నట వారసత్వం పుణికి పుచ్చుకుని చిత్రసీమలో అడుగులేసిన మరో నందమూరి హీరో... తారకరత్న. అప్పట్లో ఆయన పరిచయమే ఓ సంచలనం. తారకరత్న కథానాయకుడిగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు మొదలుకావడం ఓ రికార్డు. అందులో విడుదలైన తొలి చిత్రం... ‘ఒకటో నెంబర్ కుర్రాడు’. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 2002లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులోని పాటలు విశేష ఆదరణ పొందాయి. ‘నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా...’, ‘ఒరే నువ్వు నాకు నచ్చావురా...’, ‘నెమలీ కన్నోడా...’ తదితర గీతాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కథానాయకుడిగా తారకరత్న చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయారు కానీ... నటుడిగా మాత్రం తనని తాను నిరూపించుకున్నారు. ‘యువరత్న’, ‘తారక్’, ‘నో’, ‘భద్రాద్రి రాముడు’ సహా 22కిపైగా చిత్రాలతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చారు.
కథానాయకుడిగా పలు సినిమాలు చేసినా ఆయనకి నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి ప్రతినాయక పాత్రలు. రవిబాబు దర్శకత్వం వహించిన ‘అమరావతి’ చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల్ని భయపెట్టారు. ఆ చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. నారా రోహిత్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలోనూ తారకరత్న ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. బలమైన పాత్రలొచ్చినప్పుడు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా నటిస్తూ... కథానాయకుడిగా కూడా సినిమాలు చేశారు. ‘వెంకటాద్రి’, ‘ముక్కంటి’, ‘నందీశ్వరుడు’, ‘ఎదురులేని అలెగ్జాండర్’, ‘చూడాలని చెప్పాలని’, ‘మహాభక్త శిరియాళ’, ‘కాకతీయుడు’, ‘దేవినేని’, ‘సారథి’, ‘ఎవరు’ తదితర చిత్రాలు చేశారు. ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్‌లోనూ ఆయన నటించి మెప్పించారు. చివరిగా ఆయన ‘ఎస్5: నో ఎగ్జిట్’’ సినిమాతో సందడి చేశారు. ఇందులో ఆయన ముఖ్యమంత్రి తనయుడిగా నటించారు. ‘మిస్టర్ తారక్’ అనే సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది.
ప్రేమ వివాహం
ఎన్టీఆర్ ఐదో కుమారుడు నందమూరి మోహనకృష్ణ తనయుడే తారకరత్న. మోహనకృష్ణ ప్రముఖ ఛాయాగ్రాహకుడు. ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలకి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతోపాటు, కొన్ని చిత్రాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తారకరత్న కూడా 2002లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2012లో అలేఖ్యరెడ్డిని వివాహం చేసుకున్నారు. తెలిసిన స్నేహితుల ద్వారా పరిచయమైన ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారు. ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఓ గుడిలో కుటుంబాల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటని ఇరు కుటుంబాలూ చేరదీశాయి. అలేఖ్యరెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఈ జంటకి 2013లో నిష్కా అనే పాప జన్మించింది. తన బాబాయ్ బాలకృష్ణ అంటే తారకరత్నకి ఎంతో ప్రేమ. బాలకృష్ణ సంతకం తారకరత్న చేతిపై పచ్చబొట్టుగా కనిపిస్తుంటుంది. తారకరత్న అనారోగ్యంతో ఆస్పత్రిపాలు కావడంతో బాలకృష్ణ తల్లడిల్లిపోయారు. కొన్ని రోజులపాటు బెంగళూరులోని ఆస్పత్రిలోనే ఉంటూ మంచి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు