ఎడిటర్‌ జి.జి.కృష్ణారావు కన్నుమూత

తొలి నంది పురస్కారం అందుకున్న సీనియర్‌ ఎడిటర్‌ జి.జి.కృష్ణారావు (87) కన్నుమూశారు. 300 వందలకిపైగా సినిమాలకి ఎడిటర్‌గా పనిచేసిన ఆయన మంగళవారం ఉదయం బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Published : 22 Feb 2023 01:07 IST

తొలి నంది పురస్కారం అందుకున్న సీనియర్‌ ఎడిటర్‌ జి.జి.కృష్ణారావు (87) కన్నుమూశారు. 300 వందలకిపైగా సినిమాలకి ఎడిటర్‌గా పనిచేసిన ఆయన మంగళవారం ఉదయం బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదుర్తి సుబ్బారావు సహా, కె.విశ్వనాథ్‌, దాసరి నారాయణరావు, జంధ్యాల, బాపు తదితర అగ్ర దర్శకుల చిత్రాలకి పనిచేసి తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన ఎడిటర్‌ జి.జి.కృష్ణారావు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సహా, ‘సప్తపది’, ‘సీతామాలక్ష్మి’, ‘శుభలేఖ’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘సిరివెన్నెల’, ‘శుభసంకల్పం’, ‘స్వరాభిషేకం’ తదితర చిత్రాలకీ పనిచేశారు. ‘సప్తపది’ చిత్రంతో ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నారు. అంతవరకు ఎడిటింగ్‌ విభాగంలో నంది పురస్కారాలు లేవు. ఆ సినిమాతోనే ఆ విభాగానికి పురస్కారాలు ఇవ్వడం మొదలైంది. అలా తొలి నంది అందుకున్న ఎడిటర్‌గా కృష్ణారావు గుర్తింపు పొందారు. ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’, ‘శ్రీరామరాజ్యం’ తదితర చిత్రాలకి ఎడిటర్‌గా పనిచేసి విజయాలు అందుకున్నారు. మూడుసార్లు ఉత్తమ ఎడిటర్‌గా నంది పురస్కారాలు అందుకున్నారు. కృష్ణారావు మృతిపట్ల తెలుగు ఫిలిం ఎడిటర్స్‌ అసోసియేషన్‌ సంతాపం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని