ఏ దర్శకుడికి గెలిచే ‘ఆస్కార’మో!
ఆస్కార్ పురస్కారాల్లో కీలకమైన వాటిల్లో ఒకటి ఉత్తమ దర్శకుడు. ఈ ఏడాది ఈ అవార్డుని గెలుచుకునేది ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది.
ఆస్కార్ పురస్కారాల్లో కీలకమైన వాటిల్లో ఒకటి ఉత్తమ దర్శకుడు. ఈ ఏడాది ఈ అవార్డుని గెలుచుకునేది ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఈసారి రేసులో తొలిసారి నామినేషన్ దక్కించుకున్న వాళ్లు మొదలు గతంలో ఆస్కార్ అందుకున్న వాళ్లకు ఉన్నారు. మరి చివరికి ఎవరిని పురస్కారం వరిస్తుందో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. బరిలో ఉన్న దర్శకులెవరు? వాళ్లు తీర్చిదిద్దిన చిత్రాల విశేషాలేంటి?.
స్పీల్బర్గ్ ఆటోబయోగ్రఫీ
ఈ ఏడాది ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేషన్ దక్కించకున్నారు ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ‘ది ఫాబెల్స్మాన్’ చిత్రానికి ఈ నామినేషన్ వచ్చింది. ఆయన తన ఆటోబయోగ్రఫీనే సినిమాగా తీసారు. బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఆయనకు తన కెమరాతో సినిమాలు తీయాలని ఉండేది. సినిమాలు తీస్తూ జీవితంలో ఆయనకి ఎదురైన పరిస్థితులని ఇందులో చూపించారు. హాలీవుడ్లో కొత్త శకానికి నాంది పలికిన వ్యక్తి. చలనచిత్ర దర్శకుడు, నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాలకు మార్గదర్శకుడు. 34 సినిమాలను తెరకెక్కించడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైన దర్శకుడు స్పీల్ బర్గ్. ఆయన ‘ది షుగర్‌ల్యాండ్ ఎక్స్‌ప్రెస్(1974)’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన మూడు అకాడమీ అవార్డులు, నాలుగు డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్స్‌తో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన ఏడు సినిమాలను నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో చేర్చారు. 1995లో ఏఎఫ్ఐ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, 2015లో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ..ఇలాంటి ఎన్నో అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు.
డార్క్ కామెడీ చిత్రాలతో గుర్తింపు
లండన్‌కి చెందిన మెక్‌డొనాగ్ ఒక బ్రిటన్ నాటక రచయిత, దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన ‘ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిస్(2022) చిత్రానికి 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ఈ చిత్రంలో కోల్మ్, పాడ్రాయిక్ అనే ఇద్దరి స్నేహం గురించి, వారిలో ఒకరు మాట్లాడకుండా ఉంటే ఎలాగైనా వారి స్నేహబంధాన్ని సరిచేసుకోవడానికి బయలుదేరిన పాడ్రాయిక్కు ఎదురైన పరిస్థితులను ఇందులో చూపించారు. డొనాగ్ డార్క్ కామెడీ చిత్రాలతో గుర్తింపు పొందారు.. 2003లో ‘ది పిల్లో మ్యాన్’తో తన కెరీర్‌ను ప్రారంభించారు..బ్రాడ్వేలో అనేక నాటకాలను రచించారు. ‘ది బ్యూటీ క్వీన్ ఆఫ్ లీనెన్(1996), ది క్రిప్పల్ ఆఫ్ ఇనిష్మాన్(1996), ది లోన్సమ్ వెస్ట్(1997) నాటకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
సంగీత వీడియోతో దర్శకులుగా డానియల్స్..
అమెరికన్ దర్శకులు డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్‌లు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్(2022)’ చిత్రానికి 95వ అకాడమీ అవార్డులో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేట్ అయ్యారు. వీళ్లని డానియల్స్ అని పిలుస్తారు. ఒక చైనీస్ వలసదారు తన కుటుంబాన్ని మల్టీవర్స్ కలిగించే ప్రమాదాల నుంచి ఎలా కాపాడుకుంటుందో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’లో చూపించారు. ఈ ఇద్దరూ ‘టర్న్ డౌన్ ఫర్ వాట్ (2013)’లో సంగీత వీడియోతో దర్శకులుగా తమ వృత్తిని ప్రారంభించారు. వాస్తవిక కామెడీ చిత్రం ‘స్విస్ ఆర్మీ మ్యాన్’కు దర్శకత్వం వహించి 2016లో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2022లో చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్, డల్లాస్-ఫోర్ట్ వర్త్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకులుగా అవార్డును గెలుచుకున్నారు.
వ్యంగ్య చిత్రాలు తీయడంలో దిట్ట
95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేట్ అయిన మరో దర్శకుడు రూబెన్ ఓస్ట్లండ్. ఆయన బ్లాక్ కామెడీ, వ్యంగ్య చిత్రాలు తీయడంలో గుర్తింపు పొందిన స్వీడిష్ చిత్రనిర్మాత. ఆయన ఆంగ్ల భాషలో తెరకెక్కించిన మొదటి సినిమా ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్(2022)’తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కొందరు సాధారణ ప్రజలు సంపన్న అతిథులతో కలిసి ఓడలో విహారయాత్రకు వెళ్తే, అక్కడ వారు ఎదుర్కొన్న పరిణామాలను ఈ సినిమాలో చూపించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ది స్క్వేర్(2018)’ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీలో ‘పామ్ డిఓర్’ని గెలుచుకుంది. 2020లో ఆయన స్వీడన్ చలనచిత్రం రంగంలో చేసిన గణనీయమైన కృషికి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు.
విభిన్న సామర్థ్యాల టాడ్ ఫీల్డ్
నటుడు, దర్శకుడు, స్క్రీన్ రైటర్‌గా విభిన్న సామర్థ్యాలలో పనిచేసిన అమెరికాకి చెందిన విలియం టాడ్ ఫీల్డ్ ‘టార్’ చిత్రంతో ఈ ఏడాది అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. కండక్టరుగా పని చేస్తున్న లిడియా టార్, ఆమెకి ఎదురైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఏవిధంగా ఎదుర్కొని సంగీత విద్వాంసురాలిగా నిలిచిందనేది ఇందులో చూపించారు. ఆయన ‘ది బెడ్రూమ్(2001), లిటిల్ చిల్డ్రన్(2006) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘టార్’ లండన్ ఫిల్మ్క్రిటిక్స్ సర్కిల్ ద్వారా 2022లో ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఆయన బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ‘సత్యజిత్ రే’ అవార్డును, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ ప్రైజ్‌ను అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు