ఒక హత్య.. ఓ పెద్ద కుంభకోణం!
‘‘ఓ హత్య చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందించిన చిత్రమే ‘సీఎస్‌ఐ సనాతన్’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. ఆఖర్లో ఓ మంచి సందేశాన్ని ఇవ్వనున్నాం’’ అన్నారు అజయ్ శ్రీనివాస్.
‘‘ఓ హత్య చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందించిన చిత్రమే ‘సీఎస్‌ఐ సనాతన్’. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూనే.. ఆఖర్లో ఓ మంచి సందేశాన్ని ఇవ్వనున్నాం’’ అన్నారు అజయ్ శ్రీనివాస్. ఆయన నిర్మాణంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రమే ‘సీఎస్‌ఐ సనాతన్’. శివశంకర్‌దేవ్ తెరకెక్కించారు. మిషా నారంగ్ కథానాయిక. ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు నిర్మాత శ్రీనివాస్.
‘‘ఇది నిర్మాతగా నా తొలి సినిమా. ప్రస్తుతం థ్రిల్లర్ చిత్రాల హవా నడుస్తోంది. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులూ ఈ తరహా చిత్రాల్ని ఇష్టపడుతున్నారు. అందుకే నా తొలి సినిమాని ఈ జానర్‌లోనే చేయాలని నిర్ణయించుకున్నా. ఒక కంపెనీ అధినేత హత్య నేపథ్యంగా సాగే కథ ఇది. ఇందులో ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ల క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా చూపించాం. దీంతో పాటు ప్రస్తుతం దేశంలో చాలామందిని సర్‌ప్రైజ్ చేసిన ఓ పెద్ద కుంభకోణానికి సంబంధించిన అంశాల్ని చూపించాం. దానికి ప్రేక్షకులంతా బాగా కనెక్ట్ అవుతారు’’.
* ‘‘కథ విన్నప్పుడే దీనికి ఆది సాయికుమార్‌ను హీరోగా అనుకున్నా. ఎందుకంటే తన లుక్, బాడీలాంగ్వేజీ కథకు సరిగ్గా సరిపోతాయి. ఇందులో ఆయన పాత్ర పేరు సనాతన్. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్‌గా కనిపిస్తాడు. ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. నేపథ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. విరామ సన్నివేశాలు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నాం. అలాగే చేతబడి, మహిళల అక్రమ రవాణా నేపథ్యాల్లో రెండు సినిమాలు చేస్తున్నాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!