‘యానిమల్‌’ కోసం లండన్‌ పయనం

దక్షిణాదిలో అగ్రతారగా కొనసాగుతున్న రష్మిక బాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైంది.

Published : 21 Mar 2023 02:31 IST

దక్షిణాదిలో అగ్రతారగా కొనసాగుతున్న రష్మిక బాలీవుడ్‌లో అడుగుపెట్టి ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’ చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమైంది. వాటిలో ‘మిషన్‌ మజ్ను’ చిత్రంలో అంధురాలిగా నటించి ఆకట్టుకుంది రష్మిక. ఇప్పుడు ఆమె నటిస్తున్న మరో హిందీ చిత్రం ‘యానిమల్‌’. తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడు. ఇప్పటికే అత్యధిక శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం కీలక సన్నివేశాల చిత్రీకరణ లండన్‌లో జరగనుందని సమాచారం. ‘భారత్‌లో ‘యానిమల్‌’ చిత్రీకరణ పూర్తైంది. కీలకమైన చివరి షెడ్యూల్‌ని ఏప్రిల్‌ మొదటివారంలో యూకే, స్కాట్లాండ్‌లలో చిత్రీకరించనున్నాం. ఇది 25 రోజులపాటు కొనసాగనుంది’ అని సోమవారం చిత్రవర్గాలు చెప్పినట్లు తెలిసింది. బాబీ డియోల్‌, అనిల్‌కపూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని