కాజల్‌కు స్వాగతం

కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ మరో దఫా మురిపించేందుకు సిద్ధమైంది. సుదీర్ఘ కాలం తర్వాత ఆమె తెలుగు సినిమా సెట్లోకి అడుగుపెట్టింది.

Published : 21 Mar 2023 02:32 IST

కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ మరో దఫా మురిపించేందుకు సిద్ధమైంది. సుదీర్ఘ కాలం తర్వాత ఆమె తెలుగు సినిమా సెట్లోకి అడుగుపెట్టింది. పెళ్లి, ప్రసవంతో విరామం తీసుకున్న ఆమె... ఇటీవలే ‘భారతీయుడు2’ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చింది.   తెలుగులో బాలకృష్ణ సరసన నటించేందుకు పచ్చజెండా ఊపింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్లోకి సోమవారమే అడుగుపెట్టింది కాజల్‌. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకి ఘనంగా స్వాగతం పలికింది. ఇందులో కాజల్‌తోపాటు, మరో కథానాయిక శ్రీలీల కూడా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు