Janhvi Kapoor: పడ్డాడండీ... పట్నం అమ్మాయి ప్రేమలో

కథల ఎంపికలో చాలామంది యువతరం నాయికలకు భిన్నంగా వెళుతోంది జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). ఇటీవల ‘మిలీ’ చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది.

Updated : 23 Mar 2023 07:11 IST

కథల ఎంపికలో చాలామంది యువతరం నాయికలకు భిన్నంగా వెళుతోంది జాన్వీకపూర్‌ (Janhvi kapoor). ఇటీవల ‘మిలీ’ చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్‌ సరసన ఆడిపాడబోతుంది. హిందీలో ఆమె నటించిన ‘బవాల్‌’ (Bawaal) విడుదలకు సిద్ధమైంది. బాలీవుడ్‌ యువ కథానాయకుడు వరుణ్‌ధావన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి నితీష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. అక్టోబరు 6న సినిమాని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఓ పట్నం అందమైన అమ్మాయి ప్రేమలో పడిన పల్లెటూరి కుర్రాడి నేపథ్యంలో సాగే కథ ఇదని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని