Kushi: ప్రేమలో ‘ఖుషి’ ఖుషీగా

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘ఖుషి’(Kushi). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 24 Mar 2023 07:06 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘ఖుషి’ (Kushi). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అందులో సమంత బాల్కనీలో నుంచి కింద ఉన్న విజయ్‌ చేతిని అందుకోవడం కనిపించింది. అయితే ఆ ఇద్దరూ భిన్న నేపథ్యాలలో ఉండటం ఆసక్తిరేకెత్తిస్తోంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమ కథా చిత్రమిది. కశ్మీర్‌తో పాటు పలు అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. రెండు భిన్నమైన నేపథ్యాల మధ్య రాబోతున్న ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: జి.మురళి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని