ఖాన్స్‌... భారీ యాక్షన్‌

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి.

Published : 25 Mar 2023 01:09 IST

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. మనీష్‌ శర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా సల్మాన్‌, షారుక్‌ మధ్య జైలులో జరిగే భారీ యాక్షన్‌ సన్నివేశాలను ముంబయిలోని యష్‌ రాజ్‌ స్టూడియోలో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందులో జైలులో బందీ అయిన సల్మాన్‌ను తప్పించేందుకు వరీందర్‌ సింగ్‌ ఘుమాన్‌తో పోరాడతాడట షారుక్‌. వచ్చే నెల్లో ఈ  సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కత్రినా కైఫ్‌ నాయికగా నటిస్తోన్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు