నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే!

‘‘నచ్చావులే నచ్చావులే.. ఏరోజు చూశానో ఆరోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే’’ అంటూ తను మనసు దోచిన అమ్మాయిపై ప్రేమ గీతం ఆలపిస్తున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌.

Published : 26 Mar 2023 02:18 IST

‘‘నచ్చావులే నచ్చావులే.. ఏరోజు చూశానో ఆరోజే.. నచ్చావులే నచ్చావులే.. నీ కొంటె వేషాలే చూశాకే’’ అంటూ తను మనసు దోచిన అమ్మాయిపై ప్రేమ గీతం ఆలపిస్తున్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. ఆయన.. సంయుక్తా మేనన్‌ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్‌ దండు తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్‌ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘‘నచ్చావులే’’ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. కార్తీక్‌ ఆలపించారు. ‘‘1990లో జరిగే కథ ఇది. ఓ ప్రాంతంలో విచిత్రమైన సమస్యతో బాధపడుతున్న ప్రజల్ని కాపాడేందుకు కథానాయకుడు ఏం చేశాడన్నది కథాంశం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.  కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని