సల్మాన్‌తో మరోసారి?

సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘భజ్‌రంగీ భాయీజాన్‌’. భారత్‌లో తప్పిపోయిన పాకిస్థానీ బాలికతో కథానాయకుడికి ఏర్పడిన అనుబంధాన్ని హృద్యంగా చెప్పిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది.

Published : 26 Mar 2023 02:17 IST

ల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘భజ్‌రంగీ భాయీజాన్‌’. భారత్‌లో తప్పిపోయిన పాకిస్థానీ బాలికతో కథానాయకుడికి ఏర్పడిన అనుబంధాన్ని హృద్యంగా చెప్పిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ విజయం అందుకుంది. దీనికి సీక్వెల్‌గా ‘పవన్‌పుత్ర’ ఉంటుందని గతేడాది ప్రకటించారు. అప్పటినుంచి చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. అయితే తాజాగా ఇందులో సల్మాన్‌కి జోడీగా పూజాహెగ్డే నటించనుందని సినీవర్గాలు శనివారం ప్రకటించాయి. ఈ రెండోభాగాన్ని సైతం సల్మాన్‌ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరోవైపు సల్మాన్‌ఖాన్‌, పూజాహెగ్డేలు కలిసి నటించిన ‘కిసీ కా భాయ్‌.. కిసీ కీ జాన్‌’ ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు