ఐపీఎల్‌లో ఆటాపాటా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అంటేనే క్రికెట్‌ ఆటతోపాటు అట్టహాసంగా నిర్వహించే ప్రారంభ వేడుకలు గుర్తొస్తాయి. కరోనా కారణంగా గత నాలుగు సీజన్లలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

Published : 26 Mar 2023 02:17 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అంటేనే క్రికెట్‌ ఆటతోపాటు అట్టహాసంగా నిర్వహించే ప్రారంభ వేడుకలు గుర్తొస్తాయి. కరోనా కారణంగా గత నాలుగు సీజన్లలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. మార్చి 31 నుంచి 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఇందులో ఆరంభ పండగని ఆర్భాటంగా నిర్వహిస్తామని ఐపీఎల్‌ యాజమాన్యం ప్రకటించింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే అగ్ర కథానాయికలు తమన్నా, రష్మికలు ఇందులో భాగం కానున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ‘ఆరంభ వేడుకల ప్రదర్శన కోసం తమన్నా తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఆమె ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకొని బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ అతిపెద్ద వేడుకలో ప్రదర్శన ఇవ్వడం నటిగా ఆమెకు ఒక మంచి అవకాశం. తన ప్రతిభతో ఆమె తప్పకుండా ప్రేక్షకుల హృదయాలు గెల్చుకుంటారు’ అంటూ ఐపీఎల్‌ కీలక అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఈ వేడుకల్లో రష్మిక సైతం భాగం కానునన్నారని వార్తలు వెలువడుతున్నా.. దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని