దసరా సవాళ్ల ప్రయాణం
ఒకప్పుడు చాలామంది కథానాయికల్లాగే అందం అనే కోణంలోనే కీర్తి సురేశ్ కనిపించేవారు. ‘మహానటి’ తర్వాత మంచి నటిగానూ ప్రేక్షకుల్ని మెప్పించారు.
ఒకప్పుడు చాలామంది కథానాయికల్లాగే అందం అనే కోణంలోనే కీర్తి సురేశ్ కనిపించేవారు. ‘మహానటి’ తర్వాత మంచి నటిగానూ ప్రేక్షకుల్ని మెప్పించారు. అలా అందం, అభినయంతో ముందుకు సాగుతున్న ఆమె ‘దసరా’లో నానితో కలిసి నటించారు. ఈ సినిమాతో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా శనివారం విలేకరులతో ముచ్చటించారు.
‘దసరా’ చేస్తున్నప్పుడు సెట్లో ‘మహానటి’ రోజులు గుర్తుకొచ్చాయని ఈమధ్య ఓ వేడుకలో చెప్పారు మీరు...
కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు సెట్‌లో ఒక అరుదైన అనుభూతి కలుగుతుంటుంది. చేస్తున్న పాత్ర అనే కాదు కానీ... నటులు, సాంకేతిక నిపుణులు, మిగతా బృందంతోనూ భావోద్వేగమైన ఓ కనెక్షన్ ఏర్పడుతుంది. ‘మహానటి’ చిత్రీకరణ మొత్తం అలాంటి అనుభూతుల ప్రయాణంలానే సాగింది. మళ్లీ అదే అనుభవం ‘దసరా’కీ కలిగింది. అందుకే తప్పో ఒప్పో తెలియదు కానీ ఆ మాట చెప్పాలనిపించింది.
ఈ సినిమాకీ జాతీయ పురస్కారం వస్తుందని ఆశిస్తున్నారా?
‘మహానటి’కి కూడా పురస్కారం వస్తుందని నేను అనుకోలేదు, ఆశించలేదు. ఇప్పుడూ అంతే. కాకపోతే... అందరం చాలా బాగా చేశాం కాబట్టి ‘దసరా’ బాగా ఆడుతుందని కచ్చితంగా చెబుతా. ఈ సినిమాతో ప్రేక్షకుడికి ఓ కనెక్షన్ ఏర్పడుతుంది. అందుకే అంత నమ్మకంగా చెబుతున్నా.
మీరు పోషించిన వెన్నెల పాత్ర నటన పరంగా మీకెలాంటి సవాళ్లని విసిరింది?
నేను చేసిన క్లిష్టమైన పాత్రల్లో ఇదొకటి. మేకప్, యాస, చిత్రీకరణ చేసే ప్రదేశం... ఇలా చాలా విషయాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. మేకప్ వేసుకోవడానికి రోజూ గంట సమయం పడితే తీయడానికి రెండు గంటలు పట్టేది. బొగ్గు గనుల నేపథ్యం కాబట్టి దుమ్ము ఒంటిపై పేరుకుపోయేది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ కావడంతో పక్కా యాసతో మాట్లాడాలి. మొదట దర్శకుడు శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. మళ్లీ ఒకసారి కథ వినిపించారు.
తెలంగాణ యాస పలికే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. మామూలుగా నేను ఓ సినిమాకి రెండు మూడు రోజుల్లో డబ్బింగ్ చెప్పేస్తుంటా. కానీ దీనికి ఆరు రోజులు పట్టింది. పక్కా పల్లెటూళ్లల్లో మాట్లాడే కొన్ని చిన్న చిన్న పదాలు అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. తర్వాత సులభంగా పలికా. దర్శకుడి స్నేహితుడు శ్రీనాథ్, అలాగే ప్రొఫెసర్ సురేష్... మాకు భాష, యాస పక్కాగా నేర్పించారు.
పాత్రల్ని అర్థం చేసుకునే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
దర్శకుడిపైనే ఆధారపడతా. రాసేది దర్శకుడే కాబట్టి పాత్ర విషయంలో వాళ్లకే ఎక్కువ స్పష్టత ఉంటుందని నా నమ్మకం. అందుకే దర్శకుడు ఏం చెబితే అది నమ్ముతా. పాత్ర విషయంలో తన మీటర్ నాకు అర్థమైందంటే, నటిగా నేనేం చేయగలనో నాకు అర్థం అవుతుంది. ఆ మీటర్‌నిబట్టే పాత్రని ఎలా నిలబెట్టాలో నాకు అవగాహన ఏర్పడుతుంది.
‘మహానటి’ తర్వాత మీరు హిందీపై దృష్టి పెట్టినట్టు కనిపించింది. కానీ చేయలేదు, ఇప్పుడు ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత మీ ప్రణాళికలు ఏమైనా మారతాయా?
‘మహానటి’ తర్వాత హిందీ నుంచి కొన్ని అవకాశాలు వచ్చినా.. ఏవీ తృప్తినివ్వలేదు. అంత బలమైన పాత్ర అనిపించలేదు. అందుకే అక్కడ చేయలేదు. ‘దసరా’ పలు భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత నాకు మళ్లీ హిందీ నుంచి మంచి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తా. బాలీవుడ్ అవకాశాలపై నేను మొదట్నుంచీ ఓపెన్‌గానే ఉన్నా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఒడిశా దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు
-
Movies News
నా మెదడు సీసీ టీవీ ఫుటేజ్ లాంటిది
-
Sports News
రంగు రంగుల రబ్బరు బంతులతో.. టీమ్ఇండియా క్యాచ్‌ల ప్రాక్టీస్
-
Movies News
Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!
-
Sports News
Sehwag: ఆ ఓటమి బాధతో రెండు రోజులు హోటల్ రూమ్ నుంచి బయటికి రాలేదు: వీరేంద్ర సెహ్వాగ్
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్