NTR 30: పోరాటాల కోసం...

ఎన్టీఆర్‌ (NTR) సినిమా కోసం బలమైన సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు, కళ... తదితర విభాగాలకి నిష్ణాతులైన ప్రముఖులు నేతృత్వం వహిస్తున్నారు.

Updated : 27 Mar 2023 07:08 IST

ఎన్టీఆర్‌ (NTR) సినిమా కోసం బలమైన సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు, కళ... తదితర విభాగాలకి నిష్ణాతులైన ప్రముఖులు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ బృందంలోకి ప్రఖ్యాత యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ చేరారు. పలు హాలీవుడ్‌ చిత్రాలతోపాటు, భారతీయ చిత్రాలకి కూడా పనిచేశారు కెన్నీ. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఎన్టీఆర్‌ సినిమాకి ఆయన నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని డిజైన్‌ చేస్తున్నారు. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ - కొరటాల శివ (Koratala Siva) కలిసి చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌లో ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని