SSMB28: సంక్రాంతికి మహేష్‌ చిత్రం

కథానాయకుడు మహేష్‌బాబు (Mahesh Babu) సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్‌(Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 27 Mar 2023 07:09 IST

కథానాయకుడు మహేష్‌బాబు (Mahesh Babu) సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది. అందులో మహేష్‌ మాస్‌ లుక్‌తో స్టైలిష్‌గా నడిచొస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న వాతావరణాన్ని బట్టి ఇది మిర్చి యార్డ్‌లో జరిగే యాక్షన్‌ సన్నివేశమని అర్థమవుతోంది. సరికొత్త ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సంగీతం: తమన్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: పీఎస్‌ వినోద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని