గర్వపడేలా చేశా..

రాజ్‌కుమార్‌రావు, భూమి పెడ్నెకర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘భీడ్‌’ ఈమధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుభవ్‌ సిన్హా ఈ చిత్ర దర్శకనిర్మాత. ఇందులో దియా మీర్జా గీతాంజలిగా ఓ కీలక భూమిక పోషించారు.

Published : 28 Mar 2023 02:59 IST

రాజ్‌కుమార్‌రావు, భూమి పెడ్నెకర్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ‘భీడ్‌’ ఈమధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుభవ్‌ సిన్హా ఈ చిత్ర దర్శకనిర్మాత. ఇందులో దియా మీర్జా గీతాంజలిగా ఓ కీలక భూమిక పోషించారు. ఆమె నటనకు అంతటా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పొగడ్తలపై కృతజ్ఞతలు తెలుపుతూ దియామీర్జా సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ హృద్యమైన సందేశాన్ని పంచుకున్నారు. ‘‘భీడ్‌’లో నా నటన బాగుందని మెచ్చుకున్న అందరికీ నా కృతజ్ఞతలు. నిజానికి ఈ సినిమా కేవలం నా పిల్లల కోసమే చేశాను. కొన్నేళ్ల తర్వాత వాళ్లు ఈ చిత్రం తప్పకుండా చూస్తారు. సాటి మనుషుల పట్ల ఎలా సానుభూతి ప్రకటించాలో ఈ సినిమా చూసి నేర్చుకుంటారు. తమ తల్లి చేసిన ఈ మంచి పాత్ర పట్ల గర్వంగా ఫీలవుతారు. నాపై ఎనలేని గౌరవం చూపిస్తారు. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు అనుభవ్‌ సిన్హాకి నేను వేలవేల ధన్యవాదాలు చెప్పుకోవాలి’ అని పేర్కొన్నారు. 2020 లాక్‌డౌన్‌ నేపథ్య కథాంశంతో వచ్చిన ‘భీడ్‌’ విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని