కలం పట్టిన శ్రుతి..

శ్రుతిహాసన్‌లో మంచి నటితో పాటు అద్భుతమైన గాయని ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు స్వయంగా పాటలు రాయడంతో పాటు వాటికి బాణీలు కట్టి మెప్పిస్తుంటుంది.

Published : 28 Mar 2023 03:03 IST

శ్రుతిహాసన్‌లో మంచి నటితో పాటు అద్భుతమైన గాయని ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు స్వయంగా పాటలు రాయడంతో పాటు వాటికి బాణీలు కట్టి మెప్పిస్తుంటుంది. తనలోని ఈ కోణాలన్నింటినీ ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం చేసింది శ్రుతి. అయితే ఇప్పుడామె కథా రచయితగా మరో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ‘‘కథ చెప్పే కళకు నేనెప్పుడూ అభిమానినే. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా స్క్రిప్ట్‌ను రూపొందించడం నా కల. చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది’’ అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్‌. ఆమె మాటల్ని బట్టి చూస్తే తనిప్పటికే ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతోంది. శ్రుతి ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో నటిస్తోంది. ‘ది ఐ’ అనే హాలీవుడ్‌ చిత్రం చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని