అమలాపాల్‌... షూటింగ్‌ షురూ

‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్‌’, ‘రఘువరన్‌ బి.టెక్‌’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక అమలాపాల్‌.

Published : 29 Mar 2023 02:16 IST

‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్‌’, ‘రఘువరన్‌ బి.టెక్‌’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక అమలాపాల్‌. తాజాగా ఆమె మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆసీఫ్‌ అలీ, అమలాపాల్‌ జంటగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం మొదలైనట్టు చిత్రబృందం తెలిపింది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాకి అర్ఫాజ్‌ అయూబ్‌ దర్శకుడు. ఇందులో షరాఫుద్దీన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అజయ్‌ దేవగణ్‌ సరసన కీలక పాత్రలో నటించిన ‘భోళా’ విడుదలకు సిద్ధంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు