Chiranjeevi: పుట్టినరోజు వేడుకలో సత్కారం

ఆస్కార్‌ (oscars 2023) గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందాన్ని తన నివాసంలో ప్రత్యేకంగా సత్కరించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.

Updated : 29 Mar 2023 06:57 IST

స్కార్‌ (Oscars 2023) గెలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందాన్ని తన నివాసంలో ప్రత్యేకంగా సత్కరించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ఆయన తనయుడు, చిత్ర కథానాయకుడు రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా సోమవారం చిరంజీవి నివాసంలో వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జున సహా పలువురు తారలు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరై చరణ్‌కి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత డి.వి.వి.దానయ్య, సంగీత దర్శకుడు కీరవాణి, గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌, నృత్య దర్శకుడు ప్రేమ్‌రక్షిత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ కార్తికేయ తదితర చిత్రబృందాన్ని వేడుకలో శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు చిరంజీవి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని