పోలీస్‌ ‘మీటర్‌’

‘మీటర్‌’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అతుల్య రవి కథానాయిక. రమేష్‌ కడూరి దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 30 Mar 2023 02:24 IST

‘మీటర్‌’ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం అన్నారు కిరణ్‌ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అతుల్య రవి కథానాయిక. రమేష్‌ కడూరి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకొస్తుంది. బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. కథానాయకుడు ప్రేమికుడిగానూ, పోలీస్‌ అధికారిగానూ సందడి చేయడం ట్రైలర్‌లో కనిపిస్తుంది.  ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘అసలు సిసలు మాస్‌ కమర్షియల్‌ సినిమా ఇది. ఎన్ని అంచనాలతో థియేటర్‌కి వచ్చినా.. ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది. వేగం, ఉత్సాహం కలగలిసిన ఇలాంటి వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేయడం చాలా కష్టం. 75 రోజుల్లోనే రేయింబవళ్లు కష్టపడి పూర్తి చేశాం. భారీ పోరాటాలు, పాటలు ప్రత్యేకమైన సెట్స్‌, ఇతర హంగుల మధ్య తెరకెక్కించాం. నిర్మాత చెర్రీ, ఇతర టెక్నీషియన్లు, నటుల సహకారంతోనే ఇది సాధ్యమైంద’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ మా సంస్థలో కొంచెం ప్రయోగాత్మక చిత్రాలు చేశాం తప్ప,  వాణిజ్య ప్రధానమైన సినిమా చేయలేదు. దర్శకుడు  రమేష్‌ ఒక బలమైన అంశంతో ఈ కథని తీర్చిదిద్దాడు. కిరణ్‌ అబ్బవరంని తొలిసరి మాస్‌గా, మరింత స్టైలిష్‌గా చూడబోతున్నార’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు