ప్రశ్నించే... ‘యూనివర్సిటీ’

అర్హులకి ఉద్యోగాలు ఇచ్చి... నిరుద్యోగులకి న్యాయం చేయాలని కోరే ప్రయత్నమే మా చిత్రం అన్నారు దర్శకనిర్మాత, నటుడు  ఆర్‌.నారాయణమూర్తి.

Published : 30 Mar 2023 02:24 IST

ర్హులకి ఉద్యోగాలు ఇచ్చి... నిరుద్యోగులకి న్యాయం చేయాలని కోరే ప్రయత్నమే మా చిత్రం అన్నారు దర్శకనిర్మాత, నటుడు  ఆర్‌.నారాయణమూర్తి. ఆయన నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘యూనివర్సిటీ’. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడారు. ‘‘లంబకోణం చెప్పేవాళ్లే కుంభకోణాలు చేస్తూ వెళితే... రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు గిలగిలలాడిపోతుంటే మన విద్యావ్యవస్థకు అర్థం ఎక్కడుందని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ జరుగుతున్న దశలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో కష్టపడి పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతున్న దశలో పేపర్‌ లీకేజీలు యువతరాన్ని నిరాశ నిస్పృహలకి గురిచేస్తున్నాయి. కన్నవారి కలల్ని నెరవేర్చలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అలా జరగకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరింత అప్రమత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలన్నిటినీ మా సినిమాలో స్పృశించామ’’ని తెలిపారు నారాయణమూర్తి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని