Dasara Movie: లెక్కలేసుకొని చేసిన సినిమా కాదు
నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. అలా ‘దసరా’ సినిమాతో పరిచయమవుతున్న మరో దర్శకుడు... శ్రీకాంత్ ఓదెల. ఆయన తొలి చిత్రమే పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.
నాని సినిమాలతో కొత్త దర్శకులు వెలుగులోకి వస్తుంటారు. అలా ‘దసరా’ సినిమాతో పరిచయమవుతున్న మరో దర్శకుడు... శ్రీకాంత్ ఓదెల. ఆయన తొలి చిత్రమే పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. నాని, కీర్తిసురేశ్ జంటగా నటించిన ‘దసరా’ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శ్రీకాంత్ ఓదెల. ఆ విషయాలివీ...
నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితోనే ఈ కథ రాసుకున్నా. వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో సాగుతుంది. నా బాల్యం అంతా ఆ ఊళ్లోనే గడిచింది. ఆ ప్రభావం నాపై చాలానే ఉంటుంది. అందుకే ఆ నేపథ్యంలోనే ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించా. స్నేహం ఈ కథలో కీలకం. భావోద్వేగాలు హత్తుకునేలా ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ముందే అనుకున్నాం.
అన్ని భాషల్లోనూ నాణ్యమైన సినిమాని అందించాలని దానిపైనే దృష్టిపెట్టాను తప్ప, ఎప్పుడూ ఒత్తిడిగా అనిపించలేదు. నిజాయతీగా తీసిన సినిమా ఇది. కథానాయకుడు నానిని ఇప్పటివరకు చూడని మాస్ పాత్రలో నేను చూపించాలనో లేక ఇతరత్రా లెక్కలేవో వేసుకుని చేసిన సినిమా కాదు. నాకు అలాంటి లెక్కలేవీ తెలియవు. కథ కోణంలోనే ఆలోచిస్తూ ఎంత నిజాయతీగా చెబుతున్నాం అనే విషయంపైనే దృష్టిపెట్టి పనిచేశా. ప్రేక్షకులు కూడా ఆ కోణం నుంచే చూస్తారని నమ్ముతున్నా.
‘‘సుకుమార్ దర్శకత్వం వహించిన ‘జగడం’ చూశాకే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. మా నాన్న సింగరేణి ఉద్యోగి. పెద్దపల్లి దగ్గర సింగరేణి క్వార్టర్స్ మా నివాసం. పదో తరగతి చదువుతున్నప్పుడు విడుదలైన ‘జగడం’ చూశాక సినిమా తీయాలనే ఆసక్తి పెరిగింది. సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకున్నా. కానీ నాకు దారి కనిపించలేదు. నాలుగేళ్లు రకరకాలుగా ప్రయత్నాలు చేశా. ఆయన దృష్టిలో పడేందుకు వాళ్ల ఇంటికి ఎదురుగా నిలుచునేవాణ్ని.
నాలుగేళ్ల తర్వాత ఆయన నన్ను పిలిచి ఓ లఘు చిత్రం చేసుకుని రమ్మన్నారు. నేను చేసిన ఆ చిత్రం ఆయనకి నచ్చి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి ఆయన దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం ఇచ్చారు. ‘రంగస్థలం’ సినిమాకి చేశాక ‘దసరా’ కథ రాసుకున్నా. అప్పుడే నిర్మాత సుధాకర్ చెరుకూరి కథ విని, నానికి చెప్పమన్నారు. నాని అన్నకు వినగానే కథ నచ్చినా, నేనేలా తీస్తానో అనే సందేహం వచ్చింది. కొన్ని సన్నివేశాల్ని టెస్ట్ షూట్‌గా చేసుకొని రమ్మన్నారు. ఆ సన్నివేశాలు నచ్చాక సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు’’.
* ‘‘ఆరంభమైన కొంతసేపటికే ఆ కథా ప్రపంచంలోకి తీసుకెళ్లి లీనమయ్యేలా చేస్తుంది సినిమా. పాత్రలతో ప్రేక్షకుల మనసులతోపాటే ప్రయాణం చేస్తాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత