నేను ఎందుకు దాక్కోవాలి?
సమంత తన సినిమా పనులతో మళ్లీ బిజీ అయిపోయారు. ఒక పక్క ‘శాకుంతలం’ ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తూ... మరోవైపు ‘ఖుషి’ చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతూ కొన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు పనిపై దృష్టిపెట్టారు.
సమంత తన సినిమా పనులతో మళ్లీ బిజీ అయిపోయారు. ఒక పక్క ‘శాకుంతలం’ ప్రచార కార్యక్రమాల్ని కొనసాగిస్తూ... మరోవైపు ‘ఖుషి’ చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. మయోసైటిస్‌తో బాధపడుతూ కొన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె, ఇప్పుడు పనిపై దృష్టిపెట్టారు. ‘శాకుంతలం’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ విడాకుల తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల్ని పంచుకున్నారు. విడాకుల తర్వాత ‘పుష్ప’లో ప్రత్యేకగీతం చేసే అవకాశం వస్తే, చాలా మంది చెయ్యొద్దని సలహా ఇచ్చినట్టు చెప్పారు. నేనే తప్పు చేయనప్పుడు బాధపడుతూ, ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలని ఆ సలహాల్ని లెక్క చేయలేదన్నారు. ‘‘వైవాహిక బంధంలో నేను వందశాతం నిజాయతీగా ఉన్నా. కాకపోతే అది మేం అనుకున్నట్టుగా సాగలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలా ఎందుకు దాక్కోవాలి? అందుకే ఆ సలహాల్ని లెక్కచేయకుండా పాట చేయడానికి అంగీకరించా. నా పనే నన్ను మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి దోహదం చేస్తోంది. పనే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. గత రెండున్నరేళ్లలో నా జీవితంలో చాలా జరిగాయి. కానీ అన్నిటినీ అధిగమిస్తూ సాగుతున్నా. మంచంపై నుంచి లేవలేని పరిస్థితి ఉంటే తప్ప, నేను పనికి దూరం కాను. కొన్ని నెలలు క్రితం అదే జరిగింది. ఇప్పుడు మళ్లీ నటిగా ప్రతి విషయంలోనూ పక్కాగా ఉండాలని, అందంగా కనిపించాలని కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు సమంత.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?