దసరాకి టైగర్‌ వేట

వచ్చే వారంలోనే ‘రావణాసుర’ సినిమాతో సందడి చేయనున్నాడు రవితేజ. అందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఒకపక్క కొనసాగుతుండగా... మరోపక్క కొత్త సినిమా విడుదల తేదీ ఖరారైంది.

Published : 30 Mar 2023 02:26 IST

చ్చే వారంలోనే ‘రావణాసుర’ సినిమాతో సందడి చేయనున్నాడు రవితేజ. అందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఒకపక్క కొనసాగుతుండగా... మరోపక్క కొత్త సినిమా విడుదల తేదీ ఖరారైంది. దసరా బరిలోకి దిగుతున్నాడు రవితేజ. ఆయన కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. 1970 నేపథ్యంలో... స్టూవర్ట్‌పురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది.  ఈ సినిమాని  అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు బుధవారం సినీ వర్గాలు వెల్లడించాయి. దసరా నుంచి టైగర్‌ నాగేశ్వరరావు బాక్సాఫీస్‌ వేట ప్రారంభం అవుతుందంటూ సినీ వర్గాలు ఓ పోస్టర్‌ని విడుదల చేశాయి. ఈ సినిమా కోసం రవితేజ తన శరీరాకృతిని మార్చుకున్నారు. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా సరికొత్త హావభావాలు, యాసతో ఆయన తెరపై చేసే సందడి అలరిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం కోసం ఐదెకరాల స్థలంలో  స్టూవర్ట్‌పురం గ్రామాన్ని పునః సృష్టించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.మది, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని