500 మందితో డెవిల్‌ పోరాటాలు

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా... అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌... అనేది ఉపశీర్షిక. నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 30 Mar 2023 02:26 IST

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా... అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డెవిల్‌’. ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌... అనేది ఉపశీర్షిక. నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ నామా నిర్మాత. దేవాన్ష్‌ నామా సమర్పకులు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల్లో భాగంగా 500 మందితో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. వెంకట్‌ నేతృత్వంలో రూపొందుతున్న ఈ పోరాటఘట్టం తెలుగులోనే అత్యుత్తమ యాక్షన్‌ ఎపిసోడ్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాల్ని అందించాలనే తపన కలిగిన కథానాయకుడు కల్యాణ్‌రామ్‌. పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన ఓ సరికొత్త అవతారంలో సందడి చేయనున్నారు. మా సంస్థలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఇప్పుడు తెరకెక్కిస్తున్న సన్నివేశాలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని తెలియజేస్తామ’’ని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: గాంధీ నడికుడికర్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌.ఎస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని