సంక్షిప్త వార్తలు(2)

ఉదయ్‌, వైష్ణవి జంటగా నటించిన చిత్రం ‘మధురం’. రాజేష్‌ చికిలే దర్శకత్వం వహిస్తున్నారు. బంగార్రాజు.ఎం నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని కథానాయకుడు విష్వక్‌సేన్‌ విడుదల చేశారు. పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించేలా ఉందని, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

Published : 31 Mar 2023 01:33 IST

మనసులు ‘మధురం’

దయ్‌, వైష్ణవి జంటగా నటించిన చిత్రం ‘మధురం’. రాజేష్‌ చికిలే దర్శకత్వం వహిస్తున్నారు. బంగార్రాజు.ఎం నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని కథానాయకుడు విష్వక్‌సేన్‌ విడుదల చేశారు. పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తించేలా ఉందని, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రెండు మనసుల నేపథ్యంలో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. హృదయాల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘విభిన్నమైన మా ప్రయత్నం ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది. ఓ కొత్త అనుభూతిని పంచే చిత్రమిది’’ అన్నారు నిర్మాత.


కొత్త అందాల ‘గోదారి’

గోదావరి నదీ అందాలు, విశేషాల ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ ‘గోదారి’. ఇది ఓటీటీలో గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత స్వాతి ముళ్లపూడి మాట్లాడుతూ.. గోదావరి నదీ విశిష్టతను, దాని చుట్టూ కోట్లమంది ప్రజలు అవలంబించే సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు ఈ డాక్యుమెంటరీలో చూపించాం. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఇందులో చూడొచ్చు’’ అని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని