ARI Trailer: అంతః శత్రువులను జయిస్తేనే!

సాయికుమార్‌, అనసూయ భరద్వాజ్‌, శుభలేఖ సుధాకర్‌, ఆమని, వైవాహర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘అరి’. ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్‌ తెరకెక్కించారు.

Updated : 31 Mar 2023 07:06 IST

సాయికుమార్‌ (Sai Kumar), అనసూయ భరద్వాజ్‌ (Anasuya), శుభలేఖ సుధాకర్‌, ఆమని, వైవాహర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘అరి’ (ARI). ‘మై నేమ్‌ ఈజ్‌ నో బడీ’ అనేది ఉపశీర్షిక. జయశంకర్‌ తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. తాజాగా ఈ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ‘అరి’ చిత్రబృందంతో దిగిన ఫొటోలను పంచుకుంటూ.. ‘‘అరి’ ట్రైలర్‌ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఆరు రకాల అంతః శత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌ చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని