Kajal: బాలీవుడ్‌ కాదు.. దక్షిణాదే ఇష్టం

హిందీ చిత్రపరిశ్రమలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయంటూ కాజల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్‌ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు పొంది పలు బాలీవుడ్‌లో చిత్రాల్లోనూ నటించింది కాజల్‌.

Updated : 01 Apr 2023 07:06 IST

హిందీ చిత్రపరిశ్రమలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయంటూ కాజల్‌ (Kajal) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్‌ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు పొంది పలు బాలీవుడ్‌లో చిత్రాల్లోనూ నటించింది కాజల్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె బాలీవుడ్‌ కంటే దక్షిణాది చిత్రపరిశ్రమలోనే పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పింది. ‘హిందీ నా మాతృభాష. హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. బాలీవుడ్‌లో మంచి సినిమాల్లోనే నటించా. కానీ, నేను దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నైతికత, విలువలు, క్రమశిక్షణను ఇష్టపడతాను. అవి హిందీ చిత్రపరిశ్రమలో లోపించాయని అనుకుంటున్నాను’ అని చెప్పింది. ‘దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భాష కాబట్టి హిందీలో తమ వృత్తిని ప్రారంభించాలనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ, దక్షిణాది చిత్రపరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అద్భుతమైన దర్శకులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో మంచి కంటెంట్‌ వస్తుంటుంది’ అని చెప్పింది.  ప్రస్తుతం ఆమె చేతిలో హిందీ చిత్రం ‘ఉమ’తో పాటు ‘భారతీయుడు 2’, బాలకృష్ణ ‘ఎన్‌బీకే 108’ చిత్రాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని