Vikram: కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన విక్రమ్‌

సరికొత్త పాత్రలకి పెట్టింది పేరైనా విక్రమ్‌ నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘తంగలాన్‌’. పా రంజిత్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా తంగలాన్‌ షూటింగ్‌ కోసం కేజీఎఫ్‌లోకి అడుగు పెట్టానంటూ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు విక్రమ్‌.

Updated : 01 Apr 2023 07:08 IST

సరికొత్త పాత్రలకి పెట్టింది పేరైనా విక్రమ్‌ (Vikram) నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ‘తంగలాన్‌’. పా రంజిత్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా తంగలాన్‌ షూటింగ్‌ కోసం కేజీఎఫ్‌లోకి అడుగు పెట్టానంటూ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు విక్రమ్‌. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. బ్రిటిష్‌ పరిపాలనలో కోలార్‌ గోల్డ్‌ ఫ్యాక్టరీలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలను పోషిస్తున్నారు. జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు