Balakrishna: 109వ చిత్రం ఎవరితో?

ఒక సినిమా చేస్తూనే మరొక కథకి పచ్చజెండా ఊపేస్తూ ప్రయాణం చేస్తుంటారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తన 108వ సినిమా చిత్రీకరణతో బిజీ బిజీగా ఉన్నారు.

Updated : 08 May 2023 07:55 IST

ఒక సినిమా చేస్తూనే మరొక కథకి పచ్చజెండా ఊపేస్తూ ప్రయాణం చేస్తుంటారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తన 108వ సినిమా చిత్రీకరణతో బిజీ బిజీగా ఉన్నారు. తదుపరి ప్రాజెక్టు ఇంకా ఖరారు చేయలేదు. దాంతో 109వ సినిమా ఎవరితో ఉంటుందా? అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు వచ్చే నెలలోనే. అగ్ర తారల కొత్త సినిమాల కబుర్లు వినిపించేది కూడా పుట్టినరోజు సమయాల్లోనే. మరి ఆయన ఆలోపుగా తన తదుపరి సినిమాపై ఓ నిర్ణయానికొచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి.

మరోవైపు 109వ సినిమాకి సంబంధించి చిత్రసీమలో చాలా సంగతులే వినిపిస్తున్నాయి. మరోసారి విజయవంతమైన బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలోనే ఆ సినిమా రూపొందుతుందని, అది ‘అఖండ 2’గానే ఉంటుందనే ప్రచారం ఒకవైపు... ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా రాజకీయ నేపథ్యంలోని కథ కూడా పరిశీలనలో ఉందనే మాట మరోవైపు వినిపిస్తోంది. దీనిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి సినిమా టాకీ భాగం సన్నివేశాల్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని