Nandamuri Balakrishna: మరో మాస్‌ కలయిక.. బాలకృష్ణతో యువ దర్శకుడు సినిమా!

మరో మాస్‌ కలయికలో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో యువ దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) సినిమాని తెరకెక్కించనున్నారు.

Updated : 15 May 2023 10:08 IST

రో మాస్‌ కలయికలో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో యువ దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) సినిమాని తెరకెక్కించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు షురూ అయినట్టు తెలుస్తోంది. కథకి సంబంధించి చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. ‘వాల్తేర్‌ వీరయ్య’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు బాబీ. మాస్‌ సినిమాల్ని తీయడంలో తనకున్న పట్టుని,  సమర్థతని మరోసారి చాటి చెప్పారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతోనే చేయనున్నారని తెలుస్తోంది. ఈ కలయికలో సినిమా చాలా రోజులుగానే ప్రచారంలో ఉంది. త్వరలోనే మరింత  స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనిల్‌ రావిపూడి
దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని