Mahesh babu- Trivikram: ఆసక్తిని రేకెత్తిస్తోన్న మహేష్‌ - త్రివిక్రమ్‌ సినిమా పేరు!

మహేష్‌ - త్రివిక్రమ్‌ సినిమాకి సంబంధించిన ఓ కొత్త కబురు ఈ నెలలోనే వినిపించనుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న సినిమా పేరుని ప్రకటించనున్నారు. ఇప్పటికే  పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Published : 17 May 2023 07:18 IST

మహేష్‌ - త్రివిక్రమ్‌ సినిమాకి సంబంధించిన ఓ కొత్త కబురు ఈ నెలలోనే వినిపించనుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న సినిమా పేరుని ప్రకటించనున్నారు. ఇప్పటికే  పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని రోజులుగా ‘గుంటూరు కారం’ పేరు బలంగా వినిపిస్తోంది. ‘అమరావతికి అటూ ఇటూ’ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. చిత్రబృందం నిర్ణయం ఏమిటనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని రోజులుగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల తొలి వారం నుంచి పునః ప్రారంభం కానుందని తెలుస్తోంది. జనవరి 13,  2024గా విడుదల తేదీని ఖరారు చేసుకున్న ఈ సినిమా... అనుకున్న సమయానికి విడుదల కావాలంటే వేగంగా చిత్రీకరణ జరుపుకోవల్సిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్‌బాబుకి జోడీగా పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని