‘టక్కర్‌’.. విడుదల ఖరారు

సిద్ధార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా కార్తీక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘టక్కర్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. అభిమన్యు సింగ్‌, యోగిబాబు, మునీశ్‌ కాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 20 May 2023 02:10 IST

సిద్ధార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా కార్తీక్‌ జి.క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘టక్కర్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. అభిమన్యు సింగ్‌, యోగిబాబు, మునీశ్‌ కాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ‘‘రొమాన్స్‌, యాక్షన్‌ మేళవింపుతో రూపొందిన చిత్రమిది. సిద్ధార్థ్‌ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. ’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న, ఛాయాగ్రహణం: వాంచినాథన్‌ మురుగేశన్‌.


సుధీర్‌.. ‘జి.ఒ.ఎ.టి’!

సుడిగాలి సుధీర్‌ హీరోగా ‘పాగల్‌’ ఫేమ్‌ నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. చంద్రశేఖర్‌ రెడ్డి మొగుల్ల, బెక్కెం వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్య భారతి కథానాయిక. ఈ సినిమాకి ‘జి.ఒ.ఎ.టి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌.. అన్నది ఉపశీర్షిక. సుధీర్‌ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ కథకు తగ్గట్లే లియో చక్కటి సంగీతమందిస్తున్నారు’’ అన్నారు. ఈ సినిమాకి కూర్పు: కె.విజయవర్ధన్‌, ఛాయాగ్రహణం: బాలాజీ సుబ్రహ్మణ్యం.


యాక్షన్‌ ‘మహావీరుడు’

‘మహావీరుడు’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. అదితి శంకర్‌ కథానాయిక. ఈ చిత్ర తెలుగు హక్కులను ఏషియన్‌ సినిమాస్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘కొత్తదనం నిండిన మాస్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. శివ కార్తికేయన్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా జులై 14న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: భరత్‌ శంకర్‌, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు