Pooja Hegde: అలా నేనెప్పుడూ కొత్తగా కనిపించడానికే ఇష్టపడతా: పూజాహెగ్డే

నవతరం కథానాయికలు నటనతోనే కాదు.. ఫ్యాషన్‌ పరంగానూ అదరగొడుతున్నారు. అదొక అదనపు అర్హతలా... ప్రతిభలా భావించే భామలు చాలామందే.

Updated : 22 May 2023 14:20 IST

వతరం కథానాయికలు నటనతోనే కాదు.. ఫ్యాషన్‌ పరంగానూ అదరగొడుతున్నారు. అదొక అదనపు అర్హతలా... ప్రతిభలా భావించే భామలు చాలామందే. ఎప్పటికప్పుడు కొత్త పోకడలపై దృష్టి పెడుతూ మరింత స్టైలిష్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఒకవైపు సినీ ప్రయాణాన్ని.. మరోవైపు ఫ్యాషన్‌ ప్రయాణాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్న కథానాయికల్లో పూజాహెగ్డే (Pooja Hegde) ఒకరు. ఆమె ఫ్యాషన్‌ ఫొటోషూట్‌లతో సామాజిక మాధ్యమాల్ని వేడెక్కిస్తుంటారు. మీ దృష్టిలో ఫ్యాషన్‌ అంటే ఏమిటని ఆమెని అడిగితే... సౌకర్యం అంటూ ఠక్కున సమాధానం చెబుతోంది. ‘‘మన ఆలోచనలకి... శరీరానికి తగ్గట్టుగా ఉండే దుస్తులు ఏవైనా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. ధరించిన దుస్తులు ఎప్పుడైతే సౌకర్యంగా అనిపిస్తాయో, అవి ఎప్పటికీ కొత్తగా అనిపిస్తాయి. మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలా నేనెప్పుడూ కొత్తగా కనిపించడానికే ఇష్టపడతా. బ్రాండ్స్‌కి, డిజైన్స్‌కి నేనెక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటా’’ అని చెప్పుకొచ్చింది పూజాహెగ్డే. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబుతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని