The India House: రామ్‌చరణ్‌ నిర్మాత నిఖిల్‌ హీరో

కొత్త ప్రతిభని ప్రోత్సహించడమే లక్ష్యంగా తన స్నేహితుడు విక్రమ్‌ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్‌ అనే ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌.

Updated : 29 May 2023 09:31 IST

కొత్త ప్రతిభని ప్రోత్సహించడమే లక్ష్యంగా తన స్నేహితుడు విక్రమ్‌ రెడ్డితో కలిసి వి మెగా పిక్చర్స్‌ అనే ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించారు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌. ఈ సంస్థ నుంచి రానున్న తొలి సినిమాని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఆ సినిమా పేరు... ‘ది ఇండియా హౌస్‌’. నిఖిల్‌ సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అనుపమ్‌ఖేర్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. రామ్‌ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ జయంతి సందర్భంగా ఓ వీడియోతో ఈ సినిమాని ప్రకటించారు నిర్మాతలు. ఆ వీడియోనిబట్టి ఇది స్వాతంత్య్రానికి పూర్వం లండన్‌ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్టు స్పష్టమవుతోంది. ‘‘రాజకీయ అలజడితోపాటు... ఓ ప్రేమకథకీ చోటుంది. ప్రేక్షకుల్ని ఒక ప్రత్యేకమైన కాలానికి తీసుకెళ్లే ఈ సినిమా భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా రూపొందుతుంది. త్వరలోనే మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని