కొత్తవాళ్లను వెనక్కు లాగొద్దు.. ప్రోత్సహించండి
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు.
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో మేమ్ ఫేమస్ పంచాయితీ పేరుతో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకుడు సుమంత్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన ప్రేక్షకులు బాగుంది అన్నారు. అయితే కొందరు నెగిటివిటిని ప్రచారం చేస్తున్నారు. కొత్తవాళ్లను ఇలా వెనక్కు లాగడం సరికాదు. ఇలాంటి ప్రచారాల్ని పట్టించుకోకుండా సినిమాకు వెళ్లండి’’ అన్నారు. ‘‘ఇది యువతరం కోసం చేసిన సినిమా. అందుకే విద్యార్థులందరికీ రూ.99కే టికెట్ ఇచ్చేలా ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి దీన్ని ప్రారంభించాం. థియేటర్స్ జాబితాను అందుబాటులో పెడతాం. ఆయా థియేటర్ల టికెట్ కౌంటర్లలో స్టూడెంట్ ఐడీ కార్డు చూపిస్తే రూ.99కే టికెట్ ఇస్తారు’’ అన్నారు నిర్మాత శరత్. ఈ చిత్రంపై దర్శకుడు రాజమౌళి ట్విటర్ వేదికగా సోమవారం ప్రశంసలు కురిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాక్సాఫీస్ బరిలో అదిరే ఆట వసూళ్ల వేట
క్రీడా నేపథ్య కథలపై ప్రేక్షకులతో పాటు సినీతారలు మక్కువ కనబరుస్తుంటారు. ఆట.. అందులోని సవాళ్లు.. గెలుపు కోసం చేసే సాహసోపేతమైన ప్రయాణం.. -
గోవాకు దేవర
‘దేవర’ను పూర్తి చేయడమే లక్ష్యంగా వడివడిగా అడుగులేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
నిద్ర కోసం ఆరాటపడిన రోజులున్నాయి
‘సరదాగా తీసుకునే చిన్న చిన్న విరామాలు నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, చిత్రాల ఎంపిక విషయంలో ఎంతో దోహదపడతాయని నా అభిప్రాయం’ అంటోంది మృణాల్ ఠాకూర్. చేతి నిండా సినిమాలు... -
ప్రేక్షకుల్లో గమనించిన మార్పు అదే!
‘‘కొత్త కథలతో సినిమాలు చేయాలన్నదే నా ప్రయత్నం. పంపిణీదారుడిగా ఉన్నప్పుడు నా అభిరుచుల్ని కథానాయకులు నమ్మారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నిర్మాతగా ప్రయాణం చేస్తున్నా’’ అన్నారు రాజేశ్ దండా. -
చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా
చిత్రసీమలో ఉత్తేజాన్ని, సినీ ఔత్సాహికుల్లో స్ఫూర్తిని నింపేలా సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్టు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు ప్రకటించాయి. -
‘మగధీర’, ‘ప్రేమికుడు’ మళ్లీ..
రామ్‌చరణ్ కథానాయకుడిగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’తోపాటు, ప్రభుదేవా కథానాయకుడిగా మరో అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘ప్రేమికుడు’ రీరిలీజ్‌గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
ప్రతినాయకుడిగా శివాజీ
‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కొండా విజయ్ కుమార్. ఇప్పుడాయన ‘అహం’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. -
మోహన్‌లాల్ @ 360
‘మలైకోటై వాలిబన్’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్. ప్రస్తుతం ఆయన.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. -
యమధీర రాజకీయం
కన్నడ తార కోమల్ కుమార్ కథానాయకుడిగా... శంకర్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన అనువాద చిత్రం ‘యమధీర’. రిషిక శర్మ కథానాయిక. క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యభూమిక పోషించారు. -
రాజమండ్రిలో భీమునిపట్నం
కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు. -
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్‌తో ప్రగ్యా.. బ్రదర్‌కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Kantara: ‘కాంతార 2’.. హీరోయిన్గా ఆమెను ఎంపిక చేస్తున్నారా?
‘కాంతార 2’ హీరోయిన్‌పై చిత్ర పరిశ్రమలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?