హాలీవుడ్‌లో ఆయన.. బాలీవుడ్‌లో ఈయన

‘గ్యాస్‌లైట్‌’, ‘జర హట్‌కే జర బచ్‌కే’, ‘యే వతన్‌ మేరే వతన్‌’లాంటి వరుస చిత్రాలతో జోరు మీదున్న కథానాయిక సారా అలీఖాన్‌.

Published : 30 May 2023 05:33 IST

‘గ్యాస్‌లైట్‌’, ‘జర హట్‌కే జర బచ్‌కే’, ‘యే వతన్‌ మేరే వతన్‌’లాంటి వరుస చిత్రాలతో జోరు మీదున్న కథానాయిక సారా అలీఖాన్‌. మొదటిసారి ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఎర్ర తివాచీపై నడిచింది. చిత్రోత్సవం నుంచి తిరిగొచ్చాక అక్కడి అనుభవాలను మీడియాతో పంచుకుంది. ‘ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా.. చిత్రోత్సవాల్లో ప్రత్యేకంగా గమనించా. నేను అక్కడ సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, లెబనాన్‌, ప్యారిస్‌లకు చెందిన నటీనటులతో చాలా విషయాలపై చర్చించా. నాకెంతో ఇష్టమైన హాలీవుడ్‌ స్టార్‌ లియానార్డో డికాప్రియోనీ కలిశా. సంస్కృతులు, ప్రాంతాలు వేరైనా అందరిలో నేను గమనించిన విషయం ఏంటంటే.. వాళ్లందరికీ సినిమా అంటే వల్లమాలిన అభిమానం. ఆ ఇష్టమే దేశ సరిహద్దులను చెరిపేసి ప్రపంచ కళాకారులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తోంది’ అంటూ పలు విషయాలపై మాట్లాడింది సారా. మీకు ఏ హాలీవుడ్‌ నటుడితో రెడ్‌కార్పెట్‌పై నడవాలని ఉండేది అనే ప్రశ్నకు బదులిస్తూ ‘బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌, . హాలీవుడ్‌ విషయానికొస్తే నా మదిలో మెదిలేది ర్యాన్‌ గోస్లింగ్‌’ అంటూ చెప్పుకొచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని